హైదరాబాద్, డిసెంబర్ 19: కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ సెల్లెకార్ గాడ్జెట్స్ తన ఎయిర్‌కండీషన్ పోర్ట్‌ఫోలియోను మెరుగుపర్చేదిశగా ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యు ఫ్యాక్చరర్ (ఓఈఎం) ఈప్యాక్ డ్యూరబుల్ తో భాగస్వామ్యం ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఈప్యాక్ డ్యూరబుల్ కన్జూ మర్ డ్యూరబుల్స్ పరిశ్రమలో విశ్వసనీయమైన కంపెనీ అని, ఆధునిక తయారీ, పరి శోధనా సదుపాయాలు ఉన్నాయని, సెల్లాకార్ వివరించింది. ఈ భాగస్వామ్యం ద్వారా ఈప్యాక్ సెల్లెకార్ బ్రాండ్‌నేమ్‌తో 1 టన్ను, 1.5 టన్ను, 1.8 టన్ను తదితర కొత్త ప్రీమి యం ఎయిర్ కండీషనర్ మోడళ్లను తయా రు చేయనున్నట్లు తెలిపింది.