calender_icon.png 29 December, 2024 | 8:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతిమ్, అమన్‌లకు సీడింగ్

14-07-2024 12:58:16 AM

పారిస్: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్లు అంతిమ్ పంగల్, అమన్ షెరావత్‌లకు సీడింగ్ లభించింది. మహిళల 53 కేజీల విభాగంలో పోటీ పడనున్న అంతిమ్ పంగల్ ఒలింపిక్స్‌లో నాలుగో సీడ్‌గా బరిలోకి దిగనుంది. అంతిమ్‌కు సీడింగ్ లభించడంతో మెడల్ రౌండ్‌కు ముందు సులువైన డ్రా వచ్చే అవకాశముంది. ఇక పురుషుల 57 కేజీల ఫ్రీస్టుల్ విభాగంలో అమన్ షెరావత్ ఆరో సీడ్‌గా బరిలోకి దిగనున్నాడు.

మెడల్ రౌండ్‌కు ముందే అమన్‌కు అకారీ ఫ్యుజినామి, క్యుయాన్ పాంగ్ రూపంలో కఠిన ప్రత్యర్థులు ఎదురుకానున్నారు. మిగిలినవారిలో వినేశ్ ఫొగాట్, అన్షు మాలిక్, నిషా దహియా, రితికా హుడాలకు సీడింగ్ కేటాయించలేదు. ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ క్రీడలో ఆటగాళ్లకు సీడింగ్ ఇవ్వడం ఇదే తొలిసారి. 2023 వరల్డ్ చాంపియన్‌షిప్, 2024 కాంటినెంటల్ చాంపియన్‌షిప్, ర్యాంకింగ్స్ ఆధారంగా రెజ్లర్లకు సీడింగ్‌లు కేటాయించారు.