calender_icon.png 27 December, 2024 | 5:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిద్ధిఖీ కంటే మందే సల్మాన్‌కు స్కెచ్

06-12-2024 03:24:33 AM

వెలుగులోకి విస్తుపోయే నిజాలు

సల్మాన్ ఇంటి ముందు రెక్కీ కూడా నిర్వహించిన షూటర్లు

ముంబై, డిసెంబర్ 5: ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ కిరాయి షూటర్ల చేతిలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కల్లోలం సృష్టించింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తేల్చారు. ఈ ఘటన లో అరెస్టులు కూడా చేశారు. ప్రస్తుతం నిందితులను విచారిస్తున్న క్రమంలో పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలుస్తున్నట్లు సమాచారం.

షూటర్లు బాబా సిద్ధిఖీ కంటే ముందు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను అంతమొందించాలని ప్రణాళిక వేసుకున్నారట. ఇందు కు సంబంధించి ఏప్రిల్ నెలలోనే సల్మా న్ ఖాన్ ఇంటి వద్ద రెక్కీ కూడా నిర్వహించారట. కానీ సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద భద్రత పెద్ద ఎత్తున ఉండడంతో అది సాధ్యపడలేదని నిందితులు తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 

టైట్ సెక్యూరిటీ

సల్మాన్ ఖాన్‌ను అంతమొందిస్తామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఇది వరకే ప్రకటించింది. దీంతోనే ప్రభుత్వం ఆయనకు వై ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించా రు. అంతే కాకుండా ముంబై పోలీసులు ఏఐ సాంకేతికతో పని చేసే సీసీటీవీ కెమెరాలను కూడా అమర్చారు. వీటిల్లో ఫేసియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ కూడా ఉంది. ఇంత సెక్యూరిటీ నడుమ సల్మాన్ ఖాన్‌ను అంతమొందించడం కష్టమని భావించిన షూటర్లు బాబా సిద్ధిఖీని పొట్టన పెట్టుకున్నారు. 

అందరూ చూస్తుండగానే.. 

66 ఏండ్ల సిద్ధిఖీని ఆయన కొడుకు జీషాన్ సిద్ధిఖీకి చెందిన కార్యాలయం వెలుపల కాల్చి చంపారు. ఈ ఘటన అక్టోబర్ 12న చోటు చేసుకోగా.. ఈ ఘటనలో బాబా సిద్ధిఖీ అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని విచారిస్తున్న సమయంలోనే సిద్ధిఖీ కంటే ముందు సల్మాన్‌ను హత్య చేసేందుకే తాము ప్రణాళిక రచించినట్లు తెలిపారు.