ఖమ్మం, డిసెంబర్ 6 (విజయక్రాంతి): కొన్ని రోజుల క్రితం అమె రికాలో దుండగులు జరిపిన కాల్పు ల్లో ఖమ్మంకు చెందిన నూకారపు సాయితేజ మృతిచెందిన విష యం తెలిసిందే. సాయితేజ మృతదేహాన్ని శుక్రవారం ఖమ్మం తీసుకువచ్చారు. అమెరికా నుంచి విమానం లో హైదరాబాద్‌కు, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఖమ్మం రాపర్తినగర్‌లోని ఆయన స్వగృహానికి తీసుకొ చ్చారు. సాయితేజ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అమెరికా నుంచి భారత్‌కు మృతదేహాన్ని తీసుకురావడంలో అక్కడి తానా, టీం స్కేర్ వలంటీర్స్ ఎంతో సహకరించారు. కాగా ఎమ్మెల్సీ తాతా మధు సూదన్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర నివాళులర్పించారు.