నిఖిల్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ది ఇండియా హౌస్’. రామ్‌వంశీకృష్ణ దర్శకత్వం వహిసున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ ‘సతి’ అనే ఫీమేల్ లీడ్ పోషిస్తోంది.
మంగళవారం ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా మేకర్స్ సాయి మంజ్రేకర్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సొగసైన చీర, నగలు ధరించిన ఆమె సాంప్రదాయ అవతార్‌లో ఆకట్టుకుంటోంది. ఇందులోని నిఖిల్, సాయి మంజ్రేకర్‌ల ప్రేమకథ ఆకర్షణీయంగా ఉంటుంది. 1905లోని ప్రేమ, విప్లవం కథాంశంతో సాగే ఈ పీరియడ్ డ్రామాలో అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: రామ్‌చరణ్; బ్యానర్లు: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వీ మెగా పిక్చర్స్; ప్రొడక్షన్ డిజైనర్: విశాల్ అబానీ; కాస్ట్యూమ్ డిజైనర్: రజిని; నిర్మాతలు: అభిషేక్ అగర్వాల్, విక్రమ్‌రెడ్డి; సహ నిర్మాత: మయాంక్ సింఘానియా; రచన, దర్శకత్వం: రామ్‌వంశీకృష్ణ.