హైదరాబాద్: బంజారాహిల్స్(Banjara Hills)లో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఫుట్‌పాత్‌పై ముగ్గురు నిద్రిస్తుండగా వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి వారిని ఢీకొన్న సంఘటన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి(Basavatarakam Cancer Hospital) సమీపంలో చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షుణ్ణంగా విచారణ చేపట్టారు. క్షతగాత్రులను అత్యవసర వైద్యం కోసం వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న వ్యక్తులు ప్రమాద స్థలంలోనే కారును వదిలేసి పారిపోయారు. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.