హెజ్బొల్లాతో ఒప్పందానికి ఇజ్రాయెల్ సూత్రప్రాయ అంగీకారం
న్యూఢిల్లీ, నవంబర్ 26: అధికారులతో భద్రతాపరమైన అంశాలపై చర్చి ంచిన అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ హె జ్బొల్లాతో కాల్పుల వివరమణ ఒప్పందం కోసం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. దీంతో ఇజ్రాయెల్ క్యాబినేట్ మంగళవారం సమావేశమై కాల్పుల విరమణ ఒప్పందానికి ఆమో దం తెలపనున్నట్టు సమాచారం. అమెరికాలోని ఇజ్రాయెల్ రాయబారి మైక్ హెర్‌జోగ్ ఈ విషయాన్ని ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.
అయితే ఇంకొన్ని అం శాలపై జరుపుతున్న చర్చలు ఇంకా కొలిక్కి రాలేదని అంతర్జాతీయ మీడి యా పేర్కొంది. ఇదిలా ఉం టే ఒకవైపు కాల్పుల ఒప్పందానికి ఇజ్రాయెల్ క్యాబినేట్ అంగీకారం తెలపనుందని వార్తలు వస్తుండగా మరోవైపు ఇజ్రాయెల్ వై మానిక దళం హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకుని మంగళవారం బీరుట్‌పై దా డులు చేసినట్టు లెబనాన్ జాతీయ మీ డియా కథనాలు వెలువరించింది.