డిబిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు భీమ్ శేఖర్
సిద్దిపేట,(విజయక్రాంతి): 75 ఏళ్ల భారత రాజ్యాంగ ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం సిద్దిపేటలో భారత రాజ్యాంగ పరిరక్షణ సదస్సు నిర్వహిస్తున్నట్లు దళిత బహుజన ఫ్రంట్(Dalit Bahujan Front) జిల్లా ఉపాధ్యక్షుడు భీమ్ శేఖర్(DBF District Vice President Bheem Shekhar) తెలిపారు. నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవం నుండి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26 గణతంత్ర దినోత్సవం వరకు డిబిఎఫ్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ విలువల పరిరక్షణ ప్రచార ఉద్యమం చేపట్టినట్లు భీమ్ శేఖర్ తెలిపారు. ఈ ప్రచార ఉద్యమంలో భాగంగా సోమవారం సిద్దిపేట పట్టణంలోని టి.పి.టి.ఎఫ్ ఉపాధ్యాయ భవన్ లో జిల్లాస్థాయి భారత రాజ్యాంగ పరిరక్షణ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటలకు జరిగే సదస్సును విజయవంతం చేయాల్సిందిగా కోరారు.