calender_icon.png 4 January, 2025 | 3:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టిజన్లకు ప్రమోషన్స్ కల్పించాలి

04-12-2024 02:02:03 AM

డిప్యూటీ సీఎం భట్టికి విద్యుత్ ఉద్యోగ సంఘం నాయకుల విజ్ఞప్తి

హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): ఆర్టిజన్లకు ప్రమోషన్స్ కల్పించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకుడు జీ.సంజీవరెడ్డి కోరారు.  పలువురు విద్యుత్ ఉద్యోగ సంఘ నాయకులు మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి తమ సమస్యలపై వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై చర్చించారు.  ట్రాన్స్‌కోలో పనిచేస్తున్న సీబీడీ గ్యాంగ్ ఉద్యోగులకు హైస్కిల్డ్ వేతనాలు చెల్లించాలని కోరారు.

ఇప్పటికీ మిగిలి ఉన్న 6500 మంది అన్‌మ్యాన్డ్, కాంట్రాక్ట్ వర్కర్లను రెగ్యులర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై భట్టి  సానుకూలంగా స్పందించి త్వరలో తగిన ఆదేశాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇతర సమస్యలు ఏమైనా ఉంటే ట్రాన్స్‌కో సీఎండీతో చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు.