20-04-2025 12:08:15 AM
21న సీతాఫల్‌మండిలో తెలంగాణ ఉద్యమకారుల ప్లీనరీ, పోస్టర్ ఆవిష్కరణ
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్
ముషీరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి) : తెలంగాణ ఉద్యమకారులకి ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనకై ఈనెల 21న సీతాఫల్ మండి జిహెచ్‌ఎంసి ఫంక్షన్ హాల్ నిర్వహించ తలపెట్టిన తెలంగాణ ఉద్యమకారుల ప్లీనరి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్లినరీ వాల్ పోస్టర్ ను ఫోరం ప్రతినిధులతో కలసి ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు. అదే విధంగా 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్లు ఇవ్వాలన్నారు. తెలంగాణ సాంస్కృతిక విభాగంలో కళాకారులకి 1000 ఉద్యోగాలు కల్పించాలన్నారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పా టు చేయాలన్నారు. సంక్షేమ పథకాలలో 20 శాతం కేటాయించాలన్నారు. విద్యార్ధి ఉద్యమకారులకి ఉద్యోగాలలో 5 శాతం కేటా యించాలన్నారు.
మార్వాడీల ఆధిపత్యాన్ని తగ్గించాలన్నారు. తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. సీమాంద్ర ఆధిపత్యాన్ని తగ్గించడానికి తెలంగాణ సినిమా, విద్యా పాలసీలను ప్రకటించాలన్నారు. హామీలు జూన్ 2 తారీకు లోపు నెరవేర్చాలన్నారు. ఈ సమావేశంలో ఫోరం రాష్ట్ర నాయకులు వీరస్వామి, గగన్ కుమార్, జ్యోతి రెడ్డి, జానకి రెడ్డి, మల్లూరు అనిల్, కొంతం యాదిరెడ్డి, ఇంద్ర కుమార్, జగన్ యాదవ్, పుట్నాల కృష్ణ, నరేంద్ర గౌడ్, రాంబాబు, ఆర్కే భూ పాల్, కిరణ్ కుమార్, శ్యామల, శివ్ కుమార్ నేత, చంద్రశేఖర్, జగన్, మాణిక్యం, విజయ్ కుమార్, మహమ్మద్ గౌస్, మోహ న్ చారి, శ్రీనివాస్ గౌడ్, భాస్కర్, సురేందర్, లక్ష్మణ్, సికిందర్, శ్రీనివాస్, శ్రీధర్ పాల్గొన్నారు.