calender_icon.png 25 February, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

25-02-2025 12:39:03 AM

టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎల్గోయి ప్రభాకర్ 

సంగారెడ్డి, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టిడబ్ల్యూజేఎఫ్ సంగా రెడ్డి జిల్లా అధ్యక్షులు ఎల్గొయి ప్రభాకర్ డిమాండ్ చేశారు. సోమవారం టీడబ్ల్యూజెఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.  అనంతరం డిఆర్‌ఓ పద్మజ రాణి కి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.  టిడబ్ల్యూజేఎఫ్ సంగా రెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎల్గొయి ప్రభాకర్  మాట్లాడుతూ ఇళ్ల స్థలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు.

ఇండ్లు , ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని కోరారు. సంగారెడ్డి జిల్లాలో అర్హులైన జర్నలిస్టులను ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలన్నారు. చాలా చోట్ల ఇళ్ల స్థలాల సమస్య పెండింగ్ లో ఉందని తెలిపారు. జిల్లా మంత్రి , కలెక్టర్ చొరవ చేసుకొని జర్నలిస్టుల ఇళ్ల స్థలాల గురించి రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే రెండుసార్లు అక్రిడియేషన్ కార్డులు రెండు సార్లు రెన్యువల్ చేసినందున వెంటనే కొత్త అక్రీడియేషన్లు ఇవ్వాలని కోరారు.

జర్నలిస్టులకు ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా రిటైర్డ్ అయిన జర్నలిస్టులకు పెన్షన్ పథకాన్ని అమలు చేయాలన్నారు. కొత్త ఆరోగ్య భీమా పథకాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అమలు చేయాలన్నారు. జర్నలిస్టుల కంట్రిబ్యూషన్ ను ప్రభుత్వమే చెల్లించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, ఇందుకోసం ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ప్రత్యేక రక్షణ చట్టాన్ని తేవాలని కోరారు. అర్హత ఉన్న చిన్న , మధ్య తరహా పత్రికలను ఎంపానెల్మెంట్లో చేర్చాలని పేర్కోన్నారు. ఈ కార్య్రమంలో టీ డబ్ల్యూ జె ఎఫ్ జిల్లా అధ్యక్షులు సీలంకోటి సురేందర్, రాష్ట్ర కమిటీ సభ్యులు మేకల కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు పంపతి సంతోష్, మణి కొండ బస్వరాజు తదితరులు పార్గొన్నారు.