19-04-2025 08:20:58 PM
విశ్వహిందూ పరిషత్...
యాదాద్రి భువనగిరి (విజయక్రాంతి): పశ్చిమబెంగాల్ లో హిందువుల మీద జరుగుతున్న దాడులకు నిరసనగా జిల్లా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శనివారం కలెక్టర్ కార్యాలయంలో కార్యకర్తలు ధర్నా నిర్వహించి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి సుక్కల శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ... పశ్చిమబెంగాల్లో మతహింసవాదులు హిందూ వ్యతిరేకులు అక్కడున్నటువంటి హిందువులపైన దాడులు చేస్తూ వారి యొక్క ఆస్తుల పైన దాడులు అరాచకాలకు పాల్పడుతున్నారని హిందువుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం తక్షణమే హిందువులకు రక్షణ కల్పించి అక్కడ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. భవిష్యత్తులో హిందూ వ్యతిరేకుల ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి ఏక్కడికక్కడ హిందువులందరూ ఏకమై సంఘటిత శక్తిగా ఉండాలని పిలుపునిచ్చారు. స్వార్థపరులైన కొన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు కోసం వారికి మద్దతిస్తున్నారని ఆరోపించారు. స్వార్థ రాజకీయ నాయకులను బొందపెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని, ధర్మ రక్షణ దేశ రక్షణలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ ముందుండి హిందూ వ్యతిరేకులను తరిమికొడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పరిషత్ జిల్లా కోశాధికారి చామ రవీందర్ సామాజిక సమరసత ప్రముఖ్ కేమోజు మల్లికార్జున చారి లీగల్ సెల్ కన్వీనర్ సాల్వేరు వేణు విశ్వహిందూ పరిషత్ భువనగిరి పట్టణ అధ్యక్షులు కందికొండ సహదేవ్ సత్సంగ్ ప్రముఖ్ వల్లబోజు సతీష్ జూలకంటి రమణ మండల కార్యదర్శి రెడ్డి పోయిన బాలరాజు తదితరులు పాల్గొన్నారు.