21-04-2025 01:25:15 AM
ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదంతో భర్తీకి అవకాశం
రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): త్వరలోనే ఆర్టీసీ లో 3,038 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆర్టీసీలో సుదీర్ఘ కాలం తర్వాత ఉద్యో గాల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తుండటంతో పొన్నం హర్షం వ్యక్తం చేశారు. 3,038 ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, త్వరలోనే నోటిఫికేషన్ వేసి సాధ్యమైనంత తొందరగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు.
సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తోందని, దీని ద్వారా ఆర్టీసీలో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందని చెప్పారు. ఇప్పటి వరకు ఆర్టీసీలో మహిళలు 165 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారని, తద్వారా రూ.5,500 కోట్లు వారికి ఆదా అయ్యిందని పేర్కొన్నారు.
ఇప్పటికే మహాలక్ష్మి పథకం కోసం కొత్త బస్సులు కొనుగోలు చేశామని, తాజాగా ఉద్యోగాల భర్తీకి ఆర్టీసీ సన్నద్ధమైందని తెలిపారు. ప్రజాప్రభుత్వంలో నిరుద్యోగులకు పెద్దపీట వేస్తుందని, అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే దాదాపు 60 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసినట్టు చెప్పారు.
ఇప్పుడు మరోసారి భారీస్థాయిలో ఉద్యోగాల నోటిఫికేషన్లను క్యాలెండర్ ప్రకారం విడుదల చేయనున్నామని.. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, చక్కగా సన్నద్ధం కావాలని కోరారు. ఆర్టీసీలో సుదీర్ఘకాలం తర్వాత ఉద్యోగాల భర్తీ జరుగుతుండటం పట్ల సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
ఆర్టీసీలో భర్తీ చేసే ఖాళీలు..