calender_icon.png 22 October, 2024 | 5:13 AM

నిరుపేద బాలికకు మెరుగైన వైద్యం

22-10-2024 12:32:21 AM

నామమాత్రం ఫీజుతో డాక్టర్ దేవేందర్‌రెడ్డి ఔదార్యం

నిర్మల్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): పాముకాటుతో ప్రాణాపాయ స్థితికి చేరిన ఓ నిరుపేద బాలికకు నామమాత్రం ఫీజుతో వైద్యం చేసి  నిర్మల్ పట్టణానికి చెందిన వైద్యుడు దేవేందర్‌రెడ్డి ఔదార్యం చాటుకొన్నారు. లక్ష్మణచాంద మండలం తిర్పల్లికి చెం దిన గాండ్ల నరేశ్ కూతురు స్వప్నకు ఈ నెల 8న ఇంటి వద్ద అర్ధరాత్రి పాము కాటు వేసిం ది. ఏదో కుట్టినట్టు అనిపించడంతో తల్లిదండ్రులకు తెలిపింది. గదిలో పరిశీలించగా పాము కనిపించింది. అప్పటికే బాలిక అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో తల్లిదం డ్రులు నిర్మల్‌కు తరలించారు. చికిత్సకు డబ్బులు లేక పోవడంతో వారి ఆర్థిక పరిస్థితిని గుర్తించిన డాక్టర్ దేవేందర్‌రెడ్డి హాస్పిటల్ వైద్యులు బాలికకు నామమాత్రం ఫీజు కే వైద్యం చేసేందుకు ముందుకొచ్చారు. ఐదు రోజులపాటు వెంటిలేటర్‌పై పాపకు చికిత్స అందజేశారు. వైద్యులు దేవేందర్‌రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, శ్రావణ్‌కుమార్, మనో జ్ భరద్వాజ్‌ల పర్యవేక్షణలో బాలిక పూర్తిగా కోలుకున్నది. 14 రోజులపాటు బాలికకు ఆసుపత్రిలో చికిత్స చేసినప్పటికి.. నిరుపేద కుటుంబం కావడంతో నామమాత్రపు ఫీజు తీసుకొని ఉదారతను చాటుకున్నారు. బాలి క కుటుంబ సభ్యులు డాక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.