calender_icon.png 13 February, 2025 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే

13-02-2025 12:35:03 AM

  • పార్టీ పరంగా ఇస్తామనడం కరెక్టు కాదు
  • బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య

హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): కామారెడ్డి డిక్లరేషన్‌లో హామీ ఇచ్చినట్లుగా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ పరంగా 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని పేర్కొనడం కరెక్టు కాదన్నారు.

బుధవారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో 14 బీసీ సంఘాల అత్యవసర సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లను ఇస్తామంటూ కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అదే మాటకు కట్టుబడి ఉండాలన్నారు. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామంటే అంగీకరించబోమని హెచ్చరించారు. అలాగే కులగణనలో దొర్లిన తప్పులను సరిచేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చినట్టు గుర్తు చేశారు