calender_icon.png 19 January, 2025 | 5:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చనిపోయిన పందెంకోడికి రూ.1,11,111

19-01-2025 01:00:27 AM

* దాని పోరాట పటిమ తెలిపేందుకు వేలం

ఏలూరు, జనవరి 18: పందెంలో పాల్గొనే కోడికి లక్షలు పెట్టి కొనడం చూస్తుంటాం. కానీ ఇందుకు భిన్నంగా పందెంలో చనిపోయిన పుంజునూ రూ.లక్ష పెట్టు కొనుగోలు చేయడంంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఏలూరు ఎన్‌ఆర్‌పేట్‌కు చెందిన రాజేంద్ర, ఆహ్లాద్, రాజవంశీ పందెం పుంజును పెంచారు.

ఆ కోడి సంక్రాంతి సంబురాల సందర్భంగా గురువారం నిర్వహించిన పోటీలో పోరాడి ఓడింది. తమ పుంజు పోరాట పటిమ నలుగురికీ తెలియాలన్న ఉద్దేశంతో శుక్రవారం వేలం వేశారు. ఆసక్తి ఉన్న పలువురు వేలంలో పాల్గొనగా, కోసి, కాల్చిన ఆ కోడిని ఏలూరి గ్రామీణ మండలం జాలిపూడికి చెందిన మాగంటి నవీన్ చంద్రబోస్ రూ.1,11,111కు దక్కించుకున్నారు. నవీన్ చంద్రబోస్ ఆ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.