- 40 మందిపై పోక్సో కేసులు
- కేరళలో దారుణం
పథనంథిట్ట, జనవరి 11: దేశంలో నిత్యం ఏదో చోట మహిళలపై లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కేరళలోని పథనం థిట్టలో ఓ 18ఏళ్ల అథ్లెట్‌పై దాదాపు 64 మంది లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన సంచలనం రేపుతోంది. ఐదేళ్లుగా ఈ దారుణాలను ఎదుర్కొన్నట్లు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ఆ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. 13 ఏళ్ల వయస్సులోనే తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలు ఫిర్యాదులో పే ర్కొంది.
తమ పక్కింట్లో ఉండే ఓ వ్యక్తి తనను కొండ ప్రాంతానికి తీసుకెళ్లి, అతడి స్నేహితులతో కలిసి అత్యాచారానికి ఒడిగట్టాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాత పలువురు కోచ్‌లు, తోటి క్రీడాకారులు కూడా తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని వాపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి 64 మంది అనుమానితులను గుర్తించారు. వీరిలో 40 మందిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు 10మందికి పైగా అరెస్ట్ చేశారు.