calender_icon.png 25 March, 2025 | 9:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందాల సిరి వచ్చేసింది!

24-03-2025 12:35:18 AM

తొలి చిత్రం ‘సినిమాబండి’తో ఎంట్రీ ఇస్తూనే ప్రశంసలు అందుకున్నారు దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల. ఇప్పుడాయన రెండోచిత్రంగా వస్తోంది ‘పరదా’. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత నటిస్తున్నారు. శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని ఆనంద మీడియా బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, కాన్సెప్ట్ వీడియో, టీజర్ విడుదలయ్యాయి. తాజాగా మేకర్స్ ‘మా అందాల సిరి’ అనే పాట ను విడుదల చేయడం ద్వారా మ్యూజిక్ ప్రమోషన్స్‌ను మొదలుపెట్టేశారు. గోపీ సుంద ర్ సంగీత సారథ్యంలో శ్రీకృష్ణ, రమ్య బెహ రా ఆలపించిన ఈ గీత సాహిత్యాన్ని వనమాలి అందించారు. ఈ సినిమాకు డీవోపీ: మృదుల్ సుజిత్‌సేన్; ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల.