calender_icon.png 15 April, 2025 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాస్టర్ ప్రవీణ్ బైక్‌ను ఏ వాహనమూ ఢీకొనలేదు

13-04-2025 01:38:14 AM

దారిలో ఆయనకు మూడుసార్లు చిన్నచిన్న ప్రమాదాలు 

అతడి శరీరంలో మద్యం ఆనవాళ్లు: ఐజీ అశోక్

రాజమండ్రి, ఏప్రిల్ 12: పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఆయా కోణాల్లో దర్యాప్తు నిర్వహించినట్టు ఏపీ ఐజీ అశోక్‌కుమార్ వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి శనివారం ఆయన రాజమండ్రిలో వివరాలు వెల్లడించారు. ‘ప్రవీణ్ దారిలో వెళ్తుండగా పలువురితో మాట్లాడా రు. పలువురు సాక్షులు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సమాచారాన్ని సేకరించాం. సోషల్ మీడియాలో వచ్చినవన్నీ నిరాధార ఆరోపణలే. దారిలో పాస్టర్ ప్రవీణ్‌కు 3సార్లు చిన్న చిన్న ప్రమాదాలు జరిగాయి. దారిలో ఆరుసార్లు యూపీఐ పే మెంట్లు చేశారు. ఆయన శరీరంలో మద్యం ఆనవాళ్లు ఉన్నట్టు ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక ఇచ్చింది. కీసర టోల్ ప్లాజా వద్ద అదుపుతప్పి కిందపడ్డా రు. రామవరపాడు జంక్షన్ వద్ద ప్రవీణ్ పరిస్థితిని ఆటో డ్రైవర్ గమనించాడు.

ట్రాఫిక్ ఎస్సై సూచన మేరకు పార్కులో రెండు గంటలు నిద్రపోయారు. పరిస్థితి బాలేదు.. వెళ్లొద్దని చెప్పినా వినిపించుకోలేదు. హెడ్‌లైట్ పగిలిపోవడంతో రైట్‌సైడ్ బ్లింకర్ వేసుకొని ప్రయాణించారు. ఏలూరులో ఆయన మద్యం కొన్నా రు. అప్పటికే ప్రవీణ్ కళ్లజోడు పగిలిపోయింది. కొంతమూరు పైవంతె నపై కూడా వేగంగా వెళ్లారు. ప్రమా దం జరిగిన స్థలంలో బుల్లెట్ వాహ నం రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఆయన బుల్లెట్‌ను ఏ వాహనం ఢీ కొనలేదు. రోడ్డుపై కంకర రాళ్లు ఉండటంతో బుల్లెట్ పైకి ఎగిరి ప్రవీణ్‌పై పడిందని ఫోరెన్సిక్ నివేదిక చెప్పింది. ప్రమాదం జరిగినప్పుడు బండి ఫోర్త్‌గేర్‌లో ఉంది. ఇతర వాహనాలను ఢీకొనలేదని ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేశారు’ అని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు.