17-04-2025 07:49:41 PM
రాజరాణి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి నజ్రియా నజీమ్ పహద్ ఒక ఎమోషనల్ నోట్ విడుదల చేశారు. గత కొంతకాలంగా అందరికి దూరంగా ఉంటున్నాని, సోషల్ మీడియాలో తాను లేకపోవడంపై నజ్రియా మౌనాన్ని వీడింది. తన భావోద్వేగ శ్రేయస్సుతో ఇబ్బంది పడుతున్నానని, త్వరలోనే కోలుకొని అందరి ముందుకు వస్తానంటూ పేర్కొన్నారు. సుదీర్ఘమైన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఆమె వెలుగులోకి రాకుండా ఉండటానికి గల కారణాన్ని వివరించారు.
కొన్ని వ్యక్తిగత కారణాలతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేను అని, తన 30వ పుట్టిన రోజు, నూతన సంవత్సర వేడుకలు, తన నటించిన సినిమా సక్సెస్ మీట్ లు వంటి మరికొన్నింటికి హాజరుకాకపోవడంతో ఎన్ని మదుర క్షణాలను మిస్ అయ్యాయన్నారు. తనకు కొందరూ తమ సినిమాలో పాత్రలు ఇచ్చేందుకు ఫోన్ చేసిన సమాధానం ఇవ్వలేదని, ఈ సందర్భంగా ఆమె గురించి వివరాలు తెలుసుకునేందు ప్రయత్నించిన వారందరికీ క్షమించమని కోరారు.ఈ పోస్ట్ ను సమంతా రూత్ ప్రభు, పార్వతి, టోవినో థామస్. సౌబిన్ షాహిర్ వంటి సహచర నటిమణులు ప్రోత్సాహకరమైన సందేశాలు అందిస్తూ లైక్ చేశారు.
ఆమె అభిమానులు, సహచరులు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. నజ్రియా సన్నిహితురాలు, నటి మేఘనా రాజ్, మేము నిన్ను ప్రేమిస్తున్నాము బేబీ గర్ల్! ఎల్లప్పుడూ నీకు అండగా ఉంటాము! అది నీకు తెలుసు! (sic), అని హృదయపూర్వక ఎమోజితో రాశారు. నజ్రియా నజీమ్, ఫహద్ ఫాజిల్ ను 2014లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులు నజ్రియా సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోవడంతో వీరిద్దరూ విడిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆమె పోస్ట్ లో నజ్రీయా నజీమ్ పహద్ అని రాయడంతో విడకుల వార్తలకు చెక్ పడింది.