calender_icon.png 20 April, 2025 | 1:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాకు ప్రాణహాని ఉంది

20-04-2025 12:00:00 AM

మరోసారి నాపై దాడి చేశారు

రాజ్ మాజీ ప్రేయసి లావణ్య 

నార్సింగి పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడి 

 రాజేంద్రనగర్, ఏప్రిల్ 19 : తనకు ప్రాణహాని ఉందని, రాజ్ తరుణ్ తో పాటు శేఖర్ బాషా తనపై దాడి చేయించారని రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య ఆరోపించింది. శుక్రవారం రాత్రి కూడా తనపై మరో మారు దాడి జరిగినట్లు తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేసే కేసు నమోదు చేయడం లేదని ఆరోపించింది. తాజాగా శనివారం మరోమారు ఆమె నార్సింగి పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.

అనంతరం మీడియా తో మాట్లాడుతూ.. మూడు రోజుల క్రితం రాజ్ తరుణ్, అతడి తల్లితండ్రుల మీద ఫిర్యాదు చేస్తే పోలీసులు కేస్ పెట్టడం లేదని ఆరోపణ చేసింది. పోలీసులు న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ముందే ప్రాణాలు విడుస్తానని సందర్భంగా లావణ్య తీవ్రస్థాయిలో హెచ్చరించింది. తనకు ప్రాణహాని ఉందని చెప్పినా న్యాయం చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా లావణ్య విజ్ఞప్తి చేసింది.