ఢాకా: ఢాకా నగరం లో మొహమ్మద్పూర్ ప్రాంతంలో జూలై 19న పోలీసు కాల్పులు చోటు చేసుకున్నాయి.ఈ సంఘటనలో కిరాణా దుకాణం యజమాని అబూ సయీద్ మృతిపై బంగ్లాదేశ్ బహిష్కృత ప్రధాని షేక్ హసీనాతో పాటు మరో ఆరుగురిపై హత్య కేసు నమోదు చేశారు. ఈ మేరకు మంగళవారం డైలీ స్టార్ పత్రిక వార్త ప్రచురించింది.కాగా షేక్ హసీనా ప్రభుత్వంలో మాజీ హోంమంత్రి అసద్ ఉజ్ జమాన్ ఖాన్ కమల్, అవామీ లీగ్ జనరల్ సెక్రటరీ ఒబైదుల్ ఖాదర్ పై కూడా కేసు నమోదైనట్లు వార్తా కథనం తెలిపింది.