calender_icon.png 16 March, 2025 | 2:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూల నలుగు

17-02-2025 12:00:00 AM

ధర్మచక్రం ఆకులు

అరిగిపోయిన చీపురు పుల్లల్లా 

రాలిపోతున్నాయి!

నీతీ సత్యాలు గోతాల శవాల్లా 

కప్పెట్టబడుతున్నాయి!

ప్రైవేట్ సన్నిధికి

మోకరింపు ముమ్మరమై పోయింది

తెలుగు ఇళ్ళల్లోని సున్నాల పనులకీ, 

టైలరింగ్ పనులకీ..

ఇటుక బట్టీల పనులకీ, సిమెంట్ పనులకీ

హిందీ పక్షులు వాలుతున్నాయి!

పూత మామిడి దృశ్యం

కంటికి నలుగు బంతిపూల స్పర్శ

వొంటికి నలుగు!

రంగు పిట్టల దృశ్యం 

రాగాలకి నలుగు!

చుక్కా చందమామల ఊసులాట

ఓ మాట్లాటగా మారాలి!

క్షీరం వొంపుతూ క్షీరం గ్రోలుతూ

ఏక క్షేత్ర దేహమర్మం 

దిక్చూచిని తేరిపార చూడాలి 

జ్ఞాపకాన్ని పంచే చేతి రాతతో!

గోగు నార వొలిచినట్టు

కార్పొరేట్ వొంటి చర్మం వొలవాలి!            

వంద బిలియన్ల డాలర్లు గాకుండా

సుందర దరహాసాలు

వీధుల్లోని ముఖాలపై వెలగాలి!

క్షణక్షణం బరువెక్కుతున్న రోజులు

దూది మేఘాలుగా మారాలి!

- ఒబ్బిని 

9849558842