calender_icon.png 22 October, 2024 | 11:07 AM

3 నెలల కష్టం 8 వసంతాలుఅనంతిక

19-10-2024 12:00:00 AM

సనిల్ కుమార్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘8 వసంతాలు‘. ఫణీంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా కోసం అనంతిక చాలా కష్టపడ్డారని తాజాగా మేకర్స్ వదిలిన వీడియోను బట్టి తెలుస్తోంది. మూడు నెలల పాటు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందారు. దానికి సంబంధించిన వీడియోను క్యారెక్టర్ టీజర్ పేరిట మేకర్స్ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ఆమె మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకోవడం, మూడు నెలల పాటు ఆమె దీనికోసం పెట్టిన ఎఫర్ట్స్, తగిలిన గాయాలు, ఆమె అంకితభావం అన్నింటినీ ఆ వీడియోలో చూపించారు. ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌కు కూడా మంచి స్పందన వచ్చింది. 8 ఏళ్లలో ఒక స్త్రీ పరివర్తనను ఈ చిత్రంగా రూపొందించారు. ‘అందాన్ని దాటి చూడగలిగితే ఆడదానిలో ఓ సముద్రమే కనిపిస్తుంది’ అంటూ టీజర్ బాగా ఆకట్టుకుంది.