- అవునూర్‌లో ట్యాంక్‌ను పట్టుకున్న పోలీసులు
- ఏడాదిగా సాగుతున్న దందాకు అడ్డుకట్ట
సిరిసిల్ల, నవంబర్ 8 (విజయక్రాంతి): ఏడాదిగా గుట్టుగా సాగి స్తున్న మొలసిస్ లిక్విడ్ దందాకు సీసీఎస్ పోలీసులు అడ్డుకట్ట వేశారు. మొలసిస్ లిక్విడ్ ట్యాంక్‌ను ముస్తాబాద్ మండలం అవునూర్ గ్రామంలో శుక్రవారం సీజ్ చేశారు. మహారాష్ట్రకు చెందిన ఓ ముఠా ఏడాదిగా అక్కడి నుంచి సిరిసిల్ల జిల్లాకు మొలసిస్ లిక్విడ్‌ను అక్రమంగా సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నది. అధికారులకు అనుమానం రాకుండా అయిల్ ట్యాంక్‌లో గుట్టుగా సరఫరా చేస్తున్నారు.
పక్కా సమాచారం మేరకు సిరిసిల్ల సీసీఎస్ పోలీసులు శుక్రవారం ట్యాంక్‌ను అవునూర్‌లో సీజ్ చేశారు. ఈ లిక్విడ్‌ను పశువుల్లో పాల ఉత్పత్తి అధికంగా పెంపొందించేందుకు ఉపయోగిస్తారు. లిక్విడ్ శాంపిల్‌ను పశుసంవర్థకశాఖ అధికారులకు, ఎక్సైజ్ శాఖ అధికారులకు పంపించారు. నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.