09-04-2025 01:19:39 AM
చర్ల, ఏప్రిల్ ౮ (విజయ క్రాంతి ): చర్ల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ రాష్ట్రంబీజాపూర్ లో రూ 26 లక్షల రివార్డుతో నలుగురు మహిళా తో పాటు మొత్తం 22 మంది మావోయిస్టు లు బీజాపూర్ పోలీసుల ఎదుట మంగళవారం లొంగిపోయారు. పిఎల్‌జిఏ, తెలంగాణ రాష్ట్ర కమిటీ, సిఆర్‌సి,ఏసిఎంస్థాయి నక్సలైట్లు లొంగిపోయారు.బీజాపూర్ జిల్లాలో మూడు నెలల్లో మొత్తం 368 మంది నక్సలైట్లు లొంగిపోయారు. రోజురోజుకు మావోయిస్టు పార్టీ సభ్యులు లొంగి పోవడంతో పార్టీకి తీరని లోటు ఏర్పడుతుంది.