calender_icon.png 20 April, 2025 | 12:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విచారణకు హాజరైన మన్నె క్రిషాంక్

16-04-2025 12:37:11 AM

ఏడున్నర గంటల పాటు విచారించిన పోలీసులు 

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ సోషల్ మీడి యా కన్వీనర్ డాక్టర్ మన్నె క్రిశాంక్ మంగళవారం మరోసారి గచ్చిబౌలి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. తన లాయర్లను వెంటబె ట్టుకుని పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. హెచ్‌సీయూ వివాదంలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) వాడి సోష ల్ మీడియాలో తప్పుడు ఫోటోలు పోస్ట్ చేశారని ఆరోపణలు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. విచారణలో భాగంగా క్రిషాంక్‌ను సుమారు ఏడున్నర గంటల పాటు గచ్చిబౌలి పోలీసులు విచారించారు.