20-03-2025 06:45:26 PM
ఎస్సీలకు 20 శాతం రిజర్వేషన్ కల్పించాలి...
రిజర్వేషన్లు ఎత్తివేయడానికి వర్గీకరణ కుట్ర...
మనువాదుల కుట్రలో భాగమే వర్గీకరణ బిల్లు...
జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు తోటమల్ల రమణమూర్తి..
ఇల్లెందు (విజయక్రాంతి): రిజర్వేషన్లు ఎత్తివేయడంలోని భాగంగానే ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదించారని, వర్గీకరణ బిల్లును వెంటనే ఉపసంహరించు కోవాలని, వర్గీకరణ బిల్లును రద్దు చేయించడానికి మాలలు మరో పోరాటానికి సిద్ధంగా ఉండాలని జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు తోటమల్ల రమణమూర్తి పిలుపునిచ్చారు. గురువారం ఇల్లందు మండల కేంద్రంలో జాతీయ మాల మహానాడు ఇల్లందు నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశం నియోజకవర్గ అధ్యక్షులు కాలే పుల్లయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు తోటమల రమణమూర్తి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణ బిల్లు మంగళవారం అసెంబ్లీలో అశాస్త్రీయంగా ఆమోదించాలని ఇది పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధమని ఆరోపించారు. దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం జాతీయ మాల మహానాడు ఇల్లందు పట్టణ కమిటీని ఏకగ్రీవంగా ప్రకటించారు. అధ్యక్షులుగా వేమూరి సాల్మన్ రాజ్, ఉపాధ్యక్షులుగా మల్లిపెద్ది కమలాకర్, సెక్రటరీ అబ్బూరి సునీల్, జాయింట్ సెక్రెటరీ మంద శ్యామ్, కమటం చంద్రకళ, సిహెచ్ రామకృష్ణ, అనబత్తుల నవీన్, గండమల్ల రామకృష్ణ, ముసుగుల రాకేష్, వేమూరి రాజు, ఆనంద్, మేదరి రాజేష్, నీలం సునీల్ బాబు, పూనమల్ల సుదర్శన్, వీరభత్తుల నవీన్, బియ్యని చిరంజీవి, చిట్టి మల్ల రాజు ల్లాను ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఎడేళ్ల గణపతి, జిల్లా ఉపాధ్యక్షులు పల్లంటి రమేష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు బోడ దివ్య, జిల్లా కార్యదర్శి మద్దిటి జయ, సీనియర్ నాయకులు చందా ప్రవీణ్ కుమార్, జ్ఞాన సుందరం, పిల్లి బాబురావు, గుర్రం బిక్షపతి, మేడిపల్లి దాసు, మైపా ప్రణీత్, చెన్నమల మహేష్, బొబ్బిలి విద్యాసాగర్, బూర్గుల వెంకటేశ్వర్లు, ఆనంద్ రాజు, బోటుమంచితోకల సృజన్ కుమార్ గుడిపల్లి సుధాకర్, బండి సుధాకర్, లక్క మహేష్ల్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.