calender_icon.png 26 February, 2025 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగమంతా.. శివమయం

26-02-2025 01:50:40 AM

నేడు వేములవాడలో మహా శివరాత్రి జాతర

రాజన్న క్షేత్రానికి తరలివస్తున్న భక్తజనం 

భక్తుల కోసం ఆలయ ప్రాంగణంలో సకల సౌకర్యాలు ఏర్పాటు

వేములవాడ, ఫిబ్రవరి 25:  దక్షిణకాశీగా ప్రసిద్ధి చెంది,ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామి వారి దేవస్థానం భక్తుల కోర్కెలు తీర్చే ప్రధాన శైవక్షేత్రంగా విలసిల్లుతోంది. ఇక్కడ మహాశివ రాత్రి జాతరను వైభవంగా నిర్వహిస్తారు.మూడు రోజుల పాటు జరిగే వేడుకలకు దాదాపు 3 నుంచి 4 లక్షల వరకు భక్తులు రాజన్నను దర్శించుకుని తరిస్తారని అధికారులు అంచనా వేశారు. రాజన్న కోడెను కట్టేయడం ఇక్కడి ప్రత్యేకత. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, ఉపవాస దీక్షలు, రాత్రివేళ జాగరణ చేస్తారు.

రాజన్న క్షేత్రం చరిత్ర 

పూర్వం బ్రహ్మ, విష్ణుమూర్తిలకు తమలో ఎవరంటే గొప్ప అనే పోటీతలెత్తింది.ఆసమయంలో వారి మధ్య ఒక లింగం అవిర్భ వించింది. లింగం మొదలు, చివర ఎవరు. తెలుసుకుంటే వారే అధికులని శివుడు చెబుతారు. బ్రహ్మదేవుడు హంసరూపంలో లిం గం మూలాన్ని తెలుసుకునేందుకు పాతాళం వైపువెళ్లగా, విష్ణువు పైభాగం తెలుసుకోవడం కోసం వరాహరూపంలో వెళ్లాడు. ఇద్దరికి అది అంతాలు తెలియలేదు. బ్రహ్మదేవుడు తానే అధికుడని నిరూపించుకునేం దుకు గోవు, మొగలిపువ్వును సాక్షంగా తెచ్చుకున్నాడు. ఇది గమనించిన శివుడు లింగరూపం నుంచి ప్రత్యక్షమై తప్పుచేసిన బ్రహ్మకు భూలోకంలోఆలయం ఉండరాదని శపిస్తాడు. కాలభైరవుని రప్పించి బ్రహ్మ అయిదు తలల్లో ఒకదానిని ఖండింపజేసాడు. బ్రహ్మకు సహకరించిన మొగలి పు వ్వును భక్తులెవ్వరూ తన పూజకు వాడరా దని ఆజ్ఞాపిస్తాడు. అబద్ధం చెప్పని విష్ణువుకు భూలోకంలో తనతో సమానంగా పూజలు అందుతాయని శివుడు అంటాడు.అనంతరం బ్రహ్మ, విష్ణువు పరమేశ్వరుడిని ప్రత్యేకంగా పూజిస్తారు.

లింగోద్భవ కాలం పరమ పవిత్రం

పైన చెప్పిన సందర్భంలో పరమశివుడుమాఘ కృష్ణ చతుర్దశి రోజున కోటి సూర్య కాంతులతో శివలింగ రూపంలో ఆవిర్భవించిన అర్ధరాత్రే శివరాత్రి. శివునకు అత్యంత ప్రీతిపాత్రమైన రాత్రి. ఈసందర్భంగా శివు డ్ని బిల్వపత్రాలతో పూజించి, అభిషేకాది అర్చనలు చేయాలి. రోజంతా ఉపవాస వ్ర తాన్ని పాటించాలి. రాత్రి జాగరణ చేస్తూ నా లుగు జాముల్లోఅభిషేకించాలి. మరుసటిరోజు శివపూజ చేసి ఉపవాస వ్రతాన్ని ముగించాలి.

మహా శివరాత్రి పర్వదినం రా త్రి 11 గంటలకు లింగోద్భవకాలాన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారికి జరిపే మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకానికిప్రత్యేకత ఉంది. మహాన్యాసాన్ని చేస్తూ ముందుగా తమదేహంలోని కొన్ని ఇంద్రియాలను తాకుతూ రుద్రమంత్రాలను చదు వుతూ రుద్రుడిని అందులోకి ఆహ్వానిస్తారు. అతడు పరిపూర్ణంగా రుద్రుడి రూపాన్ని దా ల్చిన తర్వాత యజుర్వేదంలోని రుద్రం, సమకచ మక మంత్రాలను ఉచ్చరిస్తూ అభిషే కిస్తారు. ఇందులో నమకచమకాలని ఒకసా రి చెప్పిచేసేది ఏకాదశ రుద్రాభిషేకం.

అలాగే 11సార్లు నమఠాన్ని పఠించి ఒకసారి చమకాన్ని చదివి చేసేది ఏకాదశ రుద్రాభిషేకం. ఈ ఏకాదశరుద్రాభిషేకం ఏకాదశ రుద్రులకు ప్రతీక. ఒక్కో అభిషేకంలో ఒక్కో రుద్రు డు ఆవిష్కృతమవుతాడు. అనంతరం నీటి తో మరోసారి అభిషేకించి స్వామివారి మూలమూర్తిని అలం కరించి మంగళహారతిస్తారు. ఆ తర్వాత వివిధ నైవేద్యాలను సమ ర్పిస్తారు. స్వామివారికి నీరా జనం అర్పించడంతో లింగోద్భవకాల రుద్రాభిషేకం ముగు స్తుంది.

మహాశివరాత్రి నాడు.. ఉపవాసంతో త్రికరణశుద్ధిగా శివుడిని పూజిస్తే సంవత్స రకాలం నిత్య శివార్చన చేసినంత ఫలితం దక్కుతుందని సాక్షాత్తూ శంకరుడే బ్రహ్మదే వునికి చెప్పినట్లుగా పురాణం చెబుతోంది. మహాశివరాత్రి పరమేశ్వరునికి ఎంతో ప్రీతిక రమైనది. సాధారణంగా అన్ని పండుగలు పగలు జరుపుకుంటే మహాశివరాత్రి మా త్రం రాత్రి పూట జరుపుకుంటారు. శివరాత్రి జాతర కోసం రాజన్న చెంతకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా చేసిన.

ఏర్పాట్లు, వసతులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజనులు పరిశీలించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని  అధికారులకు సూచిం చారు. మహా శివరాత్రికి వచ్చే భక్తుల కోసం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్  ఉచిత బస్సులను ఆలయ అర్చకులువేదమంత్రాల మధ్య కొబ్బరికాయకొట్టి ప్రారంభించారు. ఈ బస్సులు తిప్పాపురం, కోరుబ్ల బస్టాండ్ల నుంచి భక్తులను ఆలయ పార్కింగ్ వరకు తరలిస్తాయి.