హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్(Telangana Beverages Corporation Limited)కు బీర్ల సరఫరాను తక్షణమే పునఃప్రారంభించాలని నిర్ణయించినట్లు యునైటెడ్ బ్రూవరీస్ సోమవారం ప్రకటించింది. సెబీ(SEBI) లిస్టింగ్ నిబంధనలోని నిబంధన 30 ప్రకారం, కంపెనీ టీజీబీసీఎస్ (Telangana Beverages Corporation Limited)కు తన బీర్ సరఫరాను వెంటనే పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది. తెలంగానలో బీర్ల ధరల పెంపు, బకాయి చెల్లింపులకు సంబంధించని యూబీ ఆందోళనలను సకాలంలో పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. టీజీబీసీఎస్ తో నిర్మాణాత్మక చర్చలనంతరం ప్రస్తుతానికి టీజీబీసీఎస్ కు బీర్ల సరఫరాలను ప్రారంభిస్తామన్నారు. ఇది వినియోగదారులు, కార్మికులు, వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న తాత్కాలిక నిర్ణయం యూబీ తెలిపింది.