calender_icon.png 25 April, 2025 | 9:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

98 కిలోల గంజాయి పట్టివేత

25-04-2025 01:38:34 AM

ఇద్దరి అరెస్టు వివరాలు వెల్లడించిన మేడ్చల్ ఏసిపి శ్రీనివాసరెడ్డి 

మేడ్చల్, ఏప్రిల్ 24(విజయ క్రాంతి): చత్తీస్గడ్ నుంచి మేడ్చల్ జిల్లా మీదుగా అక్రమంగా తరలిస్తున్న 98 కిలోల గంజాయిని ఎస్‌ఓటి, మేడ్చల్ పోలీసులు పట్టుకున్నారు. మేడ్చల్ ఏసిపి శ్రీనివాసరెడ్డి కథనం ప్రకారం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోటరీ క్లబ్ వద్ద ఎస్ ఓ టి, దుండిగల్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఇద్దరి వద్ద 98 కిలోల గంజాయి లభించింది.

సుకుమా జిల్లా నుంచి కర్ణాటకలోని గుల్బర్గాకు లారీలలో తరలిస్తున్నట్టు విచారణలో తేలింది. నిందితులు షేక్ మునావర్, జగదీష్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ కొత్తగూడెం భద్రాద్రి జిల్లాకు చెందినవారు. షేక్ మునావర్ మీద పోక్సో కేసు ఉంది. గుల్బర్గాకు చెందిన దేవా పరారీలో ఉన్నాడు. పట్టుబడిన గంజాయి విలువ రూ .33 లక్షల ఉంటుంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఏసిపి వివరించారు.