calender_icon.png 25 November, 2024 | 3:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అస్వస్థకు గురై విద్యార్థిని మృతి

25-11-2024 12:17:53 PM

కస్తూరిబా స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల విద్యార్థిని మృతిచెందినది తల్లిదండ్రుల ఆరోపణ

హుజురాబాద్, విజయక్రాంతి: కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట కస్తూరిబా పాఠశాలలో పదో తరగతి చదివే నిత్యశ్రీ (16)అనే విద్యార్థిని మృతి చెందింది. ఉపాధ్యాయురాలు, ఏఎన్ఎం నిర్లక్ష్యం వల్లనే నిత్యశ్రీ అనే విద్యార్థిని మృతి చెందిందని విద్యార్థిని తల్లిదండ్రులు రవి ఇందిర ఆరోపిస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ముల్కలపల్లి గ్రామానికి చెందిన రవి ఇందిర దంపతులకు ఇద్దరు పిల్లలు. కూతురు నిత్యశ్రీని జమ్మికుంట పట్టణంలోని కస్తూరిబా పాఠశాలలో పదో తరగతి చదివిస్తున్నారు. ఈనెల 17వ తేదీన విద్యార్థినికి  అస్వస్థతకు గురికాగా  తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకొని వెళ్లి తిరిగి హాస్టల్లో చేర్పించారు.

తదుపరి విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ ఉపాధ్యాయురాలు అనూష, ఏఎన్ఎం ప్రభావతిపట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈనెల 21న తమకు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. సమాచారం ఇచ్చిన వెంటనే  హనుమకొండ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు తెలిపారు. తన కూతురు మృతి చెందడానికి కారణం ఉపాధ్యాయురాలు తో పాటు ఏఎన్ఎంఏ కారణమని ఫిర్యాదు చేశారు వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవి తెలిపారు. కాగా విద్యార్థిని మృతి చెందిన విషయం తెలుసుకొని జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు పాఠశాలలకు వచ్చి వివరాల నివేదికను జిల్లా కలెక్టర్కు అందజేయనున్నట్లు తెలిపారు.