calender_icon.png 16 March, 2025 | 8:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్వాస హాయిగా!

16-03-2025 12:15:38 AM

‘చాలామంది తరచుగా శ్వాస సమస్యలతో ఇబ్బంది పడటం సాధారణంగా మారింది. ఇది తీవ్రమైన అనారోగ్య పరిస్థితులకు దారితీస్తుంది. అన్ని అవయవాలు మెరుగైన ఆక్సిజన్ పొందడానికి, నిత్యం ఆరోగ్యంగా ఉండానికి శ్వాస చాలా ముఖ్యం’ అంటున్నారు శ్వాస ఫౌండేషన్‌కు చెందిన డాక్టర్ వీరపనేని విష్ణున్ రావు. శ్వాస సమస్యలను ఎలా నివారించాలి? అందుకు కోసం ఏం చేయాలి? అనే విషయాలను ఇలా పంచుకున్నారాయన. 

ఊపిరితిత్తులకు తగినంత ఆక్సిజన్ అందని శ్వాసలోపం సమస్యను డిస్ప్నియా అంటారు. ఈ సమస్య వల్ల ఛాతీలో బిగుతుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీంతో ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడతారు. తరచుగా ఈ రకమైన సమస్యతో బాధపడుతుంటే జాగ్రత్త వహించాలి. శ్వాస ఆడకపోవడం అనేది చాలా సందర్భాలలో ఆస్తమా, అలర్జీ వంటి సమస్యలకు సంకేతంగా ఉంటుంది. ఒక్కోసారి ఎక్కువగా వ్యాయామం చేసినప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. ఈ క్రమంలో.. దీర్ఘకాలిక శ్వాస సమస్యలు కొన్నిసార్లు తీవ్రమైన పరిస్థితులకు దారి తీస్తాయి.

గుండె జబ్బులు వచ్చే ప్రమాదం

నిరంతర శ్వాస సమస్యలు గుండె జబ్బులకు కారణంకావొచ్చు. శ్వాసలోపం సమస్య చాలా రోజుల పాటు ఉన్నట్లైతే.. అది తీవ్రమైన శ్వాసకోశ వ్యాధుల సంకేతం. దీని వల్ల.. ఆస్తమా, ఊపిరితిత్తులలోని శ్వాసనాళాలను ప్రభావితం చేస్తాయి. దీనికి త్వరగా, దీర్ఘకాలిక చికిత్స అవసరం. అందువల్ల సకాలంలో రోగ నిర్ధారణ, చికిత్స చాలా ముఖ్యం.

ఒత్తిడి సమస్య

మానసిక ఒత్తిడి లేదా భయం కూడా శ్వాస సమస్యలను కలిగిస్తా యి. తీవ్ర భయాందోళనలో శ్వాస సాధారణం కంటే వేగంగా మారుతుంది. దీంతో  శ్వాస తీసుకో వడంలో ఇబ్బంది పె రుగుతుంది. ఈ పరిస్థితులను సకాలంలో నిర్ధారిం చడం.. చికిత్స చేసుకోవడం చాలా ముఖ్యం.

పిల్లలకు వస్తే

ప్రస్తుతం పెద్దలకి వచ్చినట్లుగానే  పిల్లలను కూడా శ్వాస సమస్యలు బాధిస్తున్నాయి. వాళ్ళల్లో కూడా దగ్గు, జ్వరం, జలుబు లాంటి సమస్యలు కూడా వస్తున్నాయి. అలాంటప్పుడు శ్వాసకి సంబంధించి వ్యాయామాలు వంటివి చేయించండి. దీంతో వాళ్ళలో కూడా ఇబ్బందులు రాకుండా ఉంటాయి. మంచి పోషకాహారం తీసుకోవడం, రోగ నిరోధక శక్తిని పెంపొందించే పండ్లు  తీసుకోవడం, ఫిట్‌గా ఉండడం, వ్యాయామం లాంటి పద్ధతులను  పాటించాలి. దీంతో ఆరోగ్యంగా ఉండచ్చు పైగా ఏ సమస్యకైనా చెక్ పెట్టేయొచ్చు కూడా.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలి. వేడివేడిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. 

ఐస్‌క్రీం, చల్లగా ఉన్న నీళ్లను, జ్యూస్‌ను తాగడం వల్ల జలుబు, శ్వాసకోశ సమస్యలు వస్తుంటాయి. వాటికి దూరంగా ఉండాలి.

శరీరానికి వేడినిచ్చే జొన్నలు, ఆకుకూరలు, సజ్జలు వంటి ఆహారంగా తీసుకోవాలి. గోరు వెచ్చని నీటిని మాత్రమే తాగాలి.

చెవుల్లోకి చల్లని గాలి వెళ్లకుండా రక్షణ కలిగించే దుస్తులు వేసుకోవాలి.

తరచు చేతులను సబ్బుతో కడుక్కోవాలి. జలుబు, దగ్గు ఉన్న వారు తప్పనిసరిగా చేతిరుమాలు వెంట పెట్టుకుని అడ్డుపెట్టుకోవాలి.

వాయు కాలుష్యంతో..

ప్రస్తుతం ఎయిర్ పొల్యూషన్ తీవ్ర ప్రమాదకరంగా మారింది. దీంతో పాటు ఇంట్లోవాడే అగర్‌బత్తీలు, క్యాండిల్స్, స్ప్రే వాడ కం వల్ల వాయు కాలుష్యానికి దారితీస్తోంది.  ఎక్కువగా అగరబత్తీలు వెలిగించడం, పదే పదే క్యాండిల్స్ వాడటం వల్ల వాయు కాలుష్యం పెరిగి శ్వాస సమస్యలకు కారణమవుతున్నాయి. అయితే కొందరు శ్వాస సమస్యలతో బాధపడుతున్నా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీని వల్ల పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఆస్త మా లాంటి వ్యాధులకు వెంటనే చికిత్స తీసుకోవాలి. మారుతున్న జీవన విధానం, పొగ, రసాయన కారకాలు కూడా శ్వాస సమస్యలకు ప్రధాన కారణం. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు కనీస జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. 

- డాక్టర్ విష్ణున్ రావు వీరపనేని శ్వాస ఫౌండేషన్, హైదరాబాద్