డా. వెల్దండి శ్రీధర్ రచించిన ‘కథా కచ్చీరు’ తెలంగాణ కథా సాహిత్య విమర్శ పుస్తకం ఈనెల 23న సాయంత్రం 5 గంటలకు రవీంద్రభారతి మినీహాల్ (మొదటి అంతస్తు)లో జరుగుతుంది. సభాధ్యక్షులుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.కాశీం వ్యవహరిస్తారు. ముఖ్యఅతిథిగా తెలు గు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య వెలుదండ నిత్యానందరావు, ఆవిష్కర్తగా డా.కె.శ్రీనివాస్, విశిష్ట అతిథిగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. మామిడి హరికృష్ణ, ప్రధాన వక్తగా తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యులు ప్రొ.కె. లావణ్య, ఆత్మీయ అతిథులుగా డా.సంగిశెట్టి శ్రీనివాస్, వలి హుస్సే న్ పాల్గొంటారు. తొలి ప్రతిని డా.సరోజన బండ స్వీకరిస్తారు.
- టి.వి. నారాయణ, ఎలగొండ రవి, ఆడెపు లక్ష్మణ్,
మానేరు రచయితల సంఘం