* బహిష్కరణను ఖండించిన పంజాబ్ ప్రభుత్వం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: టెక్సాస్ నుంచి 104 మంది భారతీయులతో బయల్దేరిన అమెరికా సైనిక విమానం బుధవారం 1.59 గంటలకు పంజాబ్‌లోని అమృత్‌సర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయి ంది. 79 మంది పురుషులు 25 మంది మహిళలు సహా 104 మంది ఉన్నారు.
వీరిలో 30 మంది పంజాబ్, 33 మంది హర్యానా, 33 మంది గుజరాత్ వాసులతోపాటు మహారాష్ట్రకు చెందిన ముగ్గరు, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు, ఇద్దరు చండీ గఢ్ వాసులు ఉన్నట్లు అధికారిక వర్గాలు వె ల్లడించాయి. తొలుత విమానంలో 205 అని వార్తలు వచ్చినా.. 104 మందిని మాత్ర మే తరలించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
పంజాబ్ ఎన్నారై వ్యవహారాల మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్ మాట్లాడుతూ.. భారతీయుల బహిష్కరణపై విచారం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కలగజేసుకుని అమెరికా అధ్యక్షుడితో మాట్లాడాలన్నారు.