పెర్త్ వేదికగా జరుగుతున్న భారత్, ఆస్ట్రేలియా టెస్టు మ్యాచులో టీమిండియా స్వల్ప వ్యవధిలోనే మరో వికెట్ల కోల్పోయింది. రిషబ్ పంత్ (0) ఔట్ అయ్యాడు. నాథన్ లైయన్ బౌలింగ్ లో ముందుకొచ్చి ఆడబోయిన పంత్ స్టంపౌట్ తో పెవిలియన్ కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ధ్రువ్ జురెల్(01) పాట్ కమిన్స్ బౌలింగ్ లో ఎల్బీగా పెవిలియన్ కు చేరాడు. దీంతో భారత్ వెంటనే మరో వికెట్ కోల్పోయింది. డీఆర్ఎస్ తీసుకున్నా.. సమీక్షలో అంపైరస్ కాల్ రావడంతో ధ్రువ్ నిరాశగా వెల్లిపోయాడు. ప్రస్తుతం క్రీజులోకి వాషింగ్టన్ సుందర్ వచ్చాడు. 100 ఓవర్లలో భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ (20), సుందర్(01)తో నిలకడగా ఆడుతున్నారు. ఈ మ్యాచులో భారత్ ఇప్పటికే 372 పరుగుల ఆధిక్యంలో ఉంది.