ఓ కేసులో నిర్దోషిగా ప్రకటించిన కోర్టు
ఇస్లామాబాద్, నవంబర్ 13: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఊరట లభించింది. పలు కేసుల్లో అరెస్టయి ప్రస్తుతం జైలులో ఉన్న ఇమ్రాన్‌ను ఓ కేసులో నిర్దోషిగా కోర్టు ప్రకటించింది. రెండేళ్ల క్రితం సెక్షన్ 144 ఉల్లంఘన కింద నమోదైన కేసులో ఇమ్రాన్‌తో పాటు అతని సన్నిహితులు షేక్ రషీద్, అసద్ కైజర్, సైఫుల్లా నైజీ, సాదాఖత్ అబ్బాసీ, ఫైస్ జావెద్, అలీ నవాజ్‌ను ఇస్లామాబాద్‌లోని జిల్లా సెషన్స్ కోర్టు నిర్దోషులుగా తేల్చింది.
ఇమ్రాన్ స్థాపించిన తెహ్రీక్ (పీటీఐ) పార్టీ నేతృత్వంలో చేపట్టిన నిరసన ప్రదర్శనల సందర్భంగా పబ్లిక్ ఆర్డర్‌ను ఉల్లంఘించారనే ఆరోపణలు నమోదు చేశారు. దీంతో ఇస్లామాబాద్‌లోని అబ్బారా పోలీస్ స్టేషన్‌లో ఇమ్రాన్‌తో పాటు పలువురిపై పోలీసులు 2022లో కేసు నమోదు చేశారు. కాగా, ఈ కేసులో పోలీసులు నమోదు చేసిన అభియోగాలను కోర్టు వేసింది. 2022లో ఇమ్రాన్ ప్రభుత్వం కూలిన నాటి నుంచి ఆయనపై పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. దీంతో ఇమ్రాన్ ప్రస్తుతం జైలులోనే ఉన్నారు.