calender_icon.png 22 October, 2024 | 5:20 PM

పుట్టినరోజుకు 6 చిత్రాలు

19-10-2024 12:00:00 AM

కథానాయకుడు ప్రభాస్ అక్టోబర్ 23న పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా అభిమానులకు బర్త్ డే ట్రీట్ గట్టిగానే ఇవ్వనున్నారని తెలుస్తోంది. ‘బాహుబలి’ తర్వాత రెండు సినిమాలు కొంత నిరాశను మిగిల్చినా కూడా ఆ తరువాత వచ్చిన ‘సలార్, కల్కి’ చిత్రాలు మంచి విజయాన్ని అందించాయి. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ ఇవ్వనున్న స్పెషల్ ట్రీట్స్ అభిమానులను ఆనందంలో ముంచెత్తుతున్నాయి. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఏకంగా ఆరు చిత్రాలను రీ రిలీజ్ కానున్నాయని సమాచారం. ప్రభాస్ కెరీర్‌లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాలు.. మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, ఛత్రపతి, ఈశ్వర్, రెబల్, సలార్ చిత్రాలను మేకర్స్ విడుదల చేయనున్నారని సమాచారం. ఇవి మాత్రమే కాకుండా ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల నుంచి కూడా అక్టోబర్ 23న అప్‌డేట్స్ రానున్నాయి.