calender_icon.png 17 March, 2025 | 8:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిచ్చిపిచ్చిగా మాట్లాడితే తొక్కి పడేస్తా

17-03-2025 02:10:52 AM

మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

తిమ్మాపూర్ మార్చి 16 విజయ క్రాంతి: మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ తో పాటు షాడో ఎమ్మెల్యే చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తే క్వార్టర్లో లీటర్ నీళ్లు పోసుకునేటోడు కూడా తనపై అనుచరులతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడిస్తున్నారని బిఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మండిపడ్డారు. తిమ్మాపూర్ మండలంలో గల బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద లింగాపూర్ గ్రామస్తులకు కాలువ ద్వారా నీళ్లు రాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ప్రెస్ మీట్ పెడితే లట్టుగాళ్లను పుట్టుగాళ్లను జమచేసి ఇష్టమొచ్చినట్లు తనను తిట్టిస్తున్నారని ఆరోపించారు.

తనకు ఎదురుపడి మాట్లాడే ధైర్యం లేదని ఎమ్మెల్యే గా ఉండి తనను ఇష్టం వచ్చినట్లు మాట్లాడించడం ఓ డాక్టర్ వృత్తిలో ఉండి నిచమైన స్థితికి దిగజారడం సిగ్గుచేటని కొంచమైనా బుద్ధి ఉండాలని యూస్ లెస్ ఫెల్లో, బేకుబ్, అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ సీఎం రిలీఫ్ ఫండ్ స్కాం లో జైలుకు వెళ్లడం ఖాయమని ఇప్పటికే తనకున్న సమాచారం మేరకు 6 కోట్ల 75 లక్షల స్కామ్ చేశారని చెప్పారు. ఎమ్మెల్యే తో పాటు షాడో ఎమ్మెల్యే కూడా జైలుకు తప్పకుండా పంపిస్తామని స్పష్టం చేశారు.  పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్,వంతడ్పుల సంపత్, పాశం అశోక్ రెడ్డి, పొన్నం అనిల్ గౌడ్, మాతంగి లక్ష్మణ్, వడ్లురి శంకర్, బొర్ర రవీందర్, లతోపాటు కార్యకర్తలు పాల్గొన్నారు.