23-04-2025 12:00:00 AM
కూకట్‌పల్లిలోని చెరువులను అభివృద్ధి చేయాలి
హైడ్రా కమిషనర్‌ను కలిసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 22(విజయక్రాంతి) : చెరువుల అభివృద్ధికి హైడ్రా చేస్తున్న కృషి అభినందనీయమని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నా రు. తన నియోజకవర్గం పరిధిలోని కూకట్‌పల్లి నల్లచెరువును పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడం హర్షణీయమన్నారు. తన నియోజ కవర్గంలో మిగిలిన చెరువులను కూడా అభివృద్ధి చేయాలని మంగళవారం ఎమ్మెల్సీ నవీన్ కుమార్‌తో కలిసి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు వినతిపత్రం అందజేశారు. చెరువు పరిసరాల్లో ప్లాట్లు ఉన్నవారికి టీడీఆర్ కింద తగిన నష్ట పరిహారం అందేలా చూడాలని కోరారు. నకిలీలకు ఆస్కారం లేకుండా అసలు లబ్ఢిదారులను గుర్తించాల సూచించారు.
అభివృద్ధి చేసిన చెరువుల్లో మురుగు నీరు కలవకుండా నాలాలను డైవర్ట్ చేయాలన్నారు. కబ్జాలకు పాల్పడిన వారు ఎవరైనా.. పార్టీలతో సంబంధం లేకుండా చర్యలు తీసు కోవాలని కోరారు. బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో ఐడీఎల్ చెరువు, బోయిన చెరువును, ములకత్వ చెరువు నల్ల చెరువులో కొంత భాగం సుందరీకరణ చేశామని.. కోర్టు కేసులుండడంతో పనులు పూర్తి చేయలేకపోయామని చెప్పారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ అసలైన లబ్ధిదారులను గుర్తించి వారికి నష్ట పరిహారం అందేలా చూస్తామన్నారు. నగరంలోని అన్ని చెరువుల అభివృద్ధి పనులను ప్రాధాన్య క్రమంలో చేపడతామని ఎమ్మెల్యేకు చెప్పారు.