calender_icon.png 18 October, 2024 | 5:00 PM

రూ. 4వేల పింఛన్ నాలుక మీదనే ఉంది: హరీశ్ రావు

27-07-2024 10:47:04 AM

హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభం అయ్యాయి. శాసనసభలో బడ్జెట్ పద్దుపై చర్చ జరుగుతోంది. బడ్జెట్ పై చర్చలో సభ్యులు లేవనెత్తిన అంశాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రిప్లై ఇవ్వనున్నారు. అసెంబ్లీలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు మాట్లాడుతూ... రూ. 4 వేల పింఛన్ నాలుక మీదనే ఉందన్నారు. పదేళ్ల పాలనలో ఉన్న సమాచారాన్ని తొలగించారని హరీశ్ ఆరోపించారు. రాష్ట్ర బడ్జెట్ అవాస్తవాలతో కూడిన బడ్జెట్ అని ఆయన తెలిపారు. ట్యాక్స్ రెవెన్యూ ఎక్కువ వస్తుందని బడ్జెట్ పెట్టారన్న హరీశ్ బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని స్పష్టం చేశారు. రూ. 4.5 లక్షల లేని జీఎస్ డీపీని రూ. 14 లక్షలకు తీసుకెళ్లింది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. 1400 మెగావాట్లు రామగుండం నుంచి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన బాగాలేదని మాటలు చెబితే సరిపోతుందా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలన బాగాలేదని ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రూ. 200 పింఛన్ రూ. 2 వేలకు పెంచామని హరీశ్ రావు పేర్కొన్నారు.