calender_icon.png 7 October, 2024 | 8:38 PM

మానసిక ఆరోగ్యంతోనే ఆనంద జీవితం..

07-10-2024 06:14:23 PM

కరీంనగర్, (విజయక్రాంతి): పరిపూర్ణమైన మానసిక ఆరోగ్యంతోనే ఆనంద జీవితం కలుగుతుందని  తెలంగాణ సైకాల జిస్ట్స్ అసోసియేషన్ (టీపీఏ)జిల్లా అధ్యక్షుడు  ఎజ్రా మల్లేశం, రిసోర్స్ పర్సన్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ గాలిపల్లి నాగేశ్వర్ అన్నారు. ప్రపంచ మానసిక దినోత్సవం సందర్భంగా నగరంలోని భగత్ నగర్లో నీ సీనియర్ సిటిజన్ డే కేర్ సెంటర్, లో తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వయస్సు పెరుగుతున్నది ప్రతికూల ఆలోచనలు తలెత్తుతాయి అని వాటిని సానుకూలంగా మార్చుకొని జీవితాన్ని ముందుకు కొనసాగించాలని అన్నారు. వయోవృద్ధులకు ఆందోళన, ఒత్తిడి, స్కిజోఫినియా, ఈటింగ్ డిజార్డర్, తో పాటు పది రకాల మానసిక రుక్మూతులు సంభవించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. వాటిని అధిగమించడానికి సైకాలజిస్ట్ల సహకారం తీసుకోవాలని, ఇంకా అవసరం అనుకుంటే మానసిక వైద్యుల దగ్గరికి వెళ్లి సమస్యలు పరిష్కరించుకోవలె గాని ఆత్మహత్యల ఆలోచన దరిచేయనీయద్దని అన్నారు.

సీనియర్ సిటిజెన్లకు సమాజంలో జరుగుతున్న అన్ని విషయాలపై అవగాహన ఉన్నది, అవసరమనుకుంటే సామాజిక సైకాలజిస్ట్ గా మారి అనేకులకు మార్గదర్శకంగా ఉండాలని పిలుపునిచ్చారు. మానసిక శాస్త్రం చదివిన చదివినవారే సైకాలజిస్ట్ లు కాదని పది జీవితాలకు ఉపయోగపడే ప్రేరణ కల్పిస్తే వారు కూడా  కూడా సైకాలజిస్ట్ల్ గా భావించబడతారని అభిప్రాయాన్ని వ్యక్త చేశారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో 60 సంవత్సరాలు దాటిన తర్వాతే ఎంతోమంది గొప్ప గొప్ప విజయాలు సాధించారని, జీవితం చివరి అంకం వరకు ఏదో ఒకటి సాధించాలని ఆలోచనతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే ఉచ్చిడి మోహన్ రెడ్డి మాట్లాడుతూ వృద్ధాప్యంలో మానసిక సమస్య అదిగ మించడానికి మెడిటేషన్ యోగ లాంటి లాంటి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి విషయాన్ని సానుకూలంగా ఆలోచిస్తూ జీవితాన్ని మధురంగా మార్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అందరితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సైకాలజిస్ట్ అనురాధ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సముద్రాల జనార్దన్ రావు, సత్యనారాయణ, నరసింహారెడ్డి రావు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.