calender_icon.png 16 March, 2025 | 3:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామీణ రోడ్ల అభివృద్ధికి సర్కారు కృషి

16-03-2025 12:00:00 AM

జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పడాల జనార్దన్

చేవెళ్ల, మార్చి 14:  గ్రామీణ రోడ్ల  అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పడాల జనార్దన్ తెలిపారు. శనివారం చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ..  ఎమ్మెల్యే కాలె యాదయ్య నియోజకవర్గం పై దృష్టి సారించి.... ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు నిర్మిస్తున్నారని వెల్లడించారు. ఎమ్మెల్యే సహకారంతో  ముడిమ్యాల గ్రామ స్టేజీ నుంచి మేడిపల్లి స్టేజీ వరకు 8.2 కిలోమీటర్ల మే డబుల్ లేన్ రోడ్డుకు ప్రభుత్వం రూ.24 కోట్లు మంజూరు చేసిందని ఆయన గుర్తు చేశారు .

ఈ రోడ్డు పనులకు ఇటీవల అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్,  మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేయగా.. పనులు కూడా ప్రారంభం అయ్యాయన్నారు. ఇందు లో భాగంగా ముడి మ్యాల గ్రామ పరిధిలో సీసీ రోడ్డు వేస్తున్నారని, ఇది 80 శాతం పూర్తయ్యిందన్నారు. గత ప్రభుత్వం పదేండ్లు అధికారంలో ఉన్నా.. రోడ్లను పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాం గ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రోడ్లను అభివృద్ధి చేయడంతో గ్రామాలలో ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు.