ముగిసిన గ్రామసభలు, దరఖాస్తుల వెల్లువ...
బూర్గంపాడు (విజయక్రాంతి): ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామసభల్లో అర్హులైన లబ్ధిదారులు అందరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని భద్రాచలం ఐటిడిఏ పీఓ బి. రాహుల్ అన్నారు. మండలంలోని సారపాక గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో జరిగిన గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై అర్హులైన ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన అన్నారు. ప్రజలు ఎవరు కూడా ఆందోళ న చెందవద్దని, అధికారులు దృష్టికి సమస్యలు తీసుకొస్తే తప్పకుండా పరిష్కరిస్తారని ఆయన అన్నారు.బూర్గంపాడు మండలంలో శుక్రవారం జరిగిన గ్రామసభలు ప్రశాంతంగా ముగిశాయి.
మండలంలోని సారపాక,రెడ్డిపాలెం, బూర్గంపాడు ప్రాంతాలలో గ్రామసభలు జరిగాయి. గ్రామసభల్లో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం, రైతు భరోసాల కోసం పెద్ద ఎత్తున లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకున్నారు. బూర్గంపాడు, రెడ్డిపాలెం, సారపాక గ్రామ సభల్లో అర్హత పొందిన లబ్ధిదారుల లిస్టును ప్రకటించారు. అదేవిధంగా ఇంకా అర్హత ఉన్నావారు కూడా సైతం దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. బూర్గంపాడు గ్రామసభలో బూర్గంపాడు తహశీల్దార్ ముజాహిద్, సా రపాక గ్రామసభలో ఎంపీడీవో జమలా రెడ్డి, రెడ్డి పాలెంలో వ్యవసాయ అధికారి శంకర్ ఆధ్వర్యం లో గ్రామసభలను నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.