calender_icon.png 19 April, 2025 | 12:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిడుగు పడి 20 మేకలు మృతి

18-04-2025 12:47:47 AM

జహీరాబాద్, ఏప్రిల్ 17 : జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంఘం మండలం కుప్పానగర్ గ్రామంలో పిడుగు పడి 20 మేకలు మృతి చెందాయి. గురువారం సాయంత్రం దాదాపు మూడు గంటల ప్రాంతంలో విపరీతమైన ఈదురు గాలులతో పాటు వర్షం కురిసింది.

ఈదురు గాలితో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుండడంతో గ్రామానికి చెందిన బాలయ్య అనే వ్యక్తి తన మేకలను తోలుకొని అడవిలో మేపుతుండగా పిడుగు పడినట్లు తెలిపారు. ఈ శబ్దానికి తన 20 మేకలు చనిపోయాయని, తన జీవనాధారం మేకలపైనే ఆధారపడి ఉందని ప్రభుత్వం వెంటనే తనను ఆదుకోవాలని బాలయ్య బోరునవిలపించారు.