calender_icon.png 30 October, 2024 | 8:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2026లో గగన్‌యాన్

29-10-2024 12:21:56 AM

ఇస్రో చీఫ్ సోమనాథ్

న్యూఢిల్లీ, అక్టోబర్ 28: గగన్‌యాన్‌పై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్ సోమనాథ్ కీలక ప్రకటన చేశారు. గగన్‌యాన్ ప్రయాగాన్ని ఇంతకుముందు ప్లాన్ చేసినట్టు 2025లో చేపట్టడం లేదని ప్రకటించారు. ఆకాశవాణి ఏర్పాటు చేసిన సర్దార్ పటేల్ మెమోరియల్ లెక్చర్‌లో తాజాగా ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మాన వులను అంతరిక్షంలోకి పంపించడానికి సంబంధించిన గగన్‌యాన్ ప్ర యోగాన్ని 2026కు వాయిదా వేసినట్లు తెలిపారు. అంతరిక్షయానం చేసే వ్యోమగాముల రక్షణ, ప్రయోగం విజయవంతం కోసం తీసుకుంటున్న చర్యల కారణంగానే గగన్‌యాన్‌ను 2026కు రీషెడ్యూల్ చేసినట్లు వివరించారు. అలాగే చంద్రయాన్  2028లో చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇండియా అమెరికా సంయుక్త ప్రాజెక్టున నిసార్ (నాసా ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్)ను ఈ వచ్చే ఏడాది పూర్తి చేయనున్నట్లు తెలిపారు. గ్లోబల్ స్పేస్ ఎకానమీలో ఇస్రో భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా పని చేస్తున్నామని స్పష్టం చేశారు.