20-04-2025 11:52:50 AM
కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని షిరిడి హిల్స్ లో కీర్తిశేషులు శంకర్ నాయక్ జ్ఞాపకార్థం వారి కూతురు డాక్టర్ దివ్య రేఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి కొలుకుల జైహింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్యులు ఉచితంగా నిర్వహించిన చెవి ,ముక్కు ,గొంతు పరీక్షలనుకొలుకుల జగన్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో షిరిడి హిల్స్ అధ్యక్షులు బండ మహేందర్,నర్సింగ్ నాయక్, శేషారెడ్డి,శోభ నాయక్,మిట్టల్ ముదిరాజ్,సౌమ్య దాస్, ప్రభాకర్,అనిల్ కుమార్,శివ కుమార్,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.