* కాప్రా సర్కిల్ కూడళ్లలో ఫ్లెక్సీలు
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 27(విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ కాప్రా సర్కిల్‌లోని బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే రూ.వెయ్యి జరిమాన విధించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం అవగాహన కల్పించడంలో భాగంగా కాప్రా సర్కిల్‌లోని ఈసీఐఎల్ క్రాస్‌రోడ్, రాధిక క్రాస్ రోడ్, జీఆర్ రెడ్డినగర్ క్రాస్‌రోడ్ సహా ప్రధాన కూడళ్లలో ఈమేరకు ఇక్కడ చెత్తవేస్తే రూ.1000 జరిమానా విధిస్తామంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మరో 50ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్ర జీహెచ్‌ఎంసీ కాప్రా సర్కిల్ సూపర్‌వైజర్ సుదర్శన్, జవాన్ రామకృష్ణ, ఎస్‌ఎఫ్‌ఏ శివకృష్ణ, లక్ష్మి, శిరీష అంజలి, తదితరులు పాల్గొన్నారు.