calender_icon.png 26 October, 2024 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాక్‌కు ఫరూక్ వార్నింగ్

26-10-2024 01:54:22 AM

ఉగ్రదాడులను వెంటనే ఆపేయాలని స్పష్టం

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడుల మూలాలన్నీ పాకి స్థాన్‌లోనే ఉన్నాయని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఆరోపించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, ఆర్మీ, అమాయకపు ప్రజలపై దాడులు చేయడం ఆపేయాలని పాకిస్థాన్‌ను హెచ్చరించారు. ఇరుదేశాలు స్నేహమార్గాన్ని ఎంచుకోవాలని లేకుంటే పరిస్థితులు ప్రమాదకరంగా మారుతాయని ఆయన సూచించారు. దాడులను అరికట్టేందుకు కేంద్రంతో కలిసి పనిచేస్తామని చెప్పారు. దాడులకు మూలాలు తమకు తెలుసని అమాయక ప్రజల్ని చంపే ఘటనలను 30 ఏళ్లుగా కళ్లారా చూస్తున్నామని అన్నారు. దాడుల్లో సామాన్యులతో పాటు ఎంతోమంది సైనికులు అమరులయ్యారన్నారు. తరుచూ దాడులకు పాల్పడితే పాకిస్థాన్‌లో కశ్మీర్ భాగమవుతుందని ఆ దేశం తప్పుడు ఉద్దేశంతో ఉంది. అది ఎప్పటికీ జరగదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ముందు తమ దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టుకోవాలి. వారి భవిష్యత్‌ను వారే నాశనం చేసకుంటున్నారు. కశ్మీర్ ఏమీ పాకిస్థాన్‌లో భాగం కాదన్నారు.