calender_icon.png 22 November, 2024 | 7:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫుడ్‌సేఫ్టీపై తప్పుడు ప్రచారం

22-11-2024 02:46:57 AM

ఖండించిన ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్

హైదరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి): ఫుడ్ సేఫ్టీలో హైదరాబా ద్ చివరన ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఖండించారు. 2022లో ఫుడ్ సేఫ్టీకి సంబం ధించి నమోదైన కేసుల ఆధారంగా, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2023 డిసెంబర్‌లో నివేదిక విడుదల చేసిందని ఆయన ఒక ప్రకటనలో తెలిపా రు. 2022లో హైదరాబాద్‌లో ఫుడ్ కల్తీపై 246 కేసులు నమోదయ్యాయని, ఇదే విషయాన్ని 2023 చివరలో విడుదలైన క్రైం ఇన్ ఇండి యా -2022 నివేదికలో పొందుపర్చారని తెలిపారు. 2022 సమాచారంతో ఇప్పుడు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని కర్ణన్ అన్నారు. హోటళ్లు, జనాభా సంఖ్యకు అనుగుణంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల సంఖ్యను పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు 

కమిషనర్ తెలిపారు.